సమంత వస్తే రెండు నెలల్లో 'ఖుషి' పూర్తి చేస్తానంటున్న శివ

విజయ్ దేవరకొండ హీరో గా శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందుతున్న ఖుషి సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయి విడుదలకు సిద్ధమవ్వాల్సి ఉంది.

కానీ సమంత అనారోగ్య కారణాల పరిస్థితుల వల్ల షూటింగ్ ఆలస్యమైంది.

గత కొన్ని నెలలుగా సమంత పూర్తి గా ఇంటికే పరిమితమైంది.కనుక సినిమా చిత్రీకరణ ఆగి పోయింది.

ఇదే సమయం లో విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమా తో తీవ్రం గా నిరాశ పర్చాడు.అందుకే ఆయన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం ఈ సినిమా పై మరింత శ్రద్ధ చూపిస్తున్నాడు.

ఖుషి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.ఎట్టకేలకు సమంత అనారోగ్యం నుండి కోలుకుంది.

Advertisement

ఆమె పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా మారకుండా కూడా షూటింగ్ కి జాయిన్ అవ్వబోతున్నట్లుగా ప్రకటించింది.ఇటీవల శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ వేడుక లో సమంత పాల్గొన్న విషయం తెలిసిందే.

అదే సమయం లో సినిమా షూటింగ్స్ కి కూడా సమంత హాజరవుతున్నట్లుగా ఆమె సన్నిహితులు ప్రకటించారు.మొదటగా విజయ్ దేవరకొండ సినిమా లోనే సమంత నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.సమంత డేట్లు ఇస్తే కేవలం రెండు నెలల్లోనే సినిమా మొత్తాన్ని పూర్తి చేసి వెంటనే విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా దర్శకుడు శివ నిర్వాన ఆ మధ్య ప్రకటించాడు.

కనుక సమంత వెంటనే డేట్లు ఇస్తే సమ్మర్ లో ఖుషి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తారని సమాచారం అందుతుంది.సమంత ఈ సినిమా తో సక్సెస్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.మరో వైపు సమంత బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమా ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

అక్కడ కూడా  ఈ ఏడాదిలో ఆమె నుండి సినిమాలు వస్తాయి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement