మీరు అన్ మ్యాచబుల్... రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు ఇన్ని రోజులపాటు తన వ్యక్తిగత విషయాలు ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత ఇటీవల వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతున్నారు.

ఇకపోతే ఈమె నటించిన హనీ బన్నీ( Honey Bunny ) అనే వెబ్ సిరీస్ నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది.

మరోవైపు పలు సినిమాలో షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Samantha React On Charan Game Changer Second Single, Samantha ,ramcharan, Game C

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత మరో వైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఈమె మెగా హీరో రామ్ చరణ్ తేజ్ పై( Ramcharan Tej ) ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.చరణ్ సమంత ఇద్దరు కలిసి రంగస్థలం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Samantha React On Charan Game Changer Second Single, Samantha ,ramcharan, Game C
Advertisement
Samantha React On Charan Game Changer Second Single, Samantha ,Ramcharan, Game C

ఇకపోతే తాజాగా  సమంత రామ్ చరణ్ నటించిన గేమ్‌ ఛేంజర్‌( Game Changer ) సినిమా నుంచి రా మచ్చా మచ్చా( Raa Macha Macha ) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలోనే సమంత ఈ పాట పట్ల స్పందిస్తూ.

మిమ్మల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు.అన్‌మ్యాచ్‌బుల్‌.

అని పేర్కొన్నారు.దానికింద ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు.

అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం చరణ్ గురించి సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇక ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు అధికారికంగా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు