పబ్లిసిటీ ఫుల్.. రిజల్ట్ నిల్.. సమంత, నయనతారలకు భారీ షాకులు తగిలాయిగా!

స్టార్ హీరోయిన్లు నయనతార,( Nayanthara ) సమంతల( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇద్దరి హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ఇద్దరు కూడా టాప్ హీరోయిన్ లే.ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరికి వారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకరు వెబ్ సిరీస్‌తో మరొకరు డాక్యుమెంటరీతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ రెండిటికి పబ్లిసిటీ పీక్‌ లో వచ్చినా రిజల్ట్ మాత్రం ఏ మంత గొప్పగా రాలేదు.

Samantha Nayanthara Face Backlash Publicity Over Content, Samantha, Nayanatara,

ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఈ ఇద్దరి భామలపై విరుచుకుపడుతున్నారు.కాగా హీరోయిన్ సమంత మయోసైటిస్‌ తో( Myositis ) ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో హైలెట్‌ గా నిలుస్తున్న సమయంలోనే సిటాడెల్ హనీ బన్నీ( Citadel Honey Bunny ) సిరీస్‌తో ముందుకొచ్చింది.అయితే ఈ సిరీస్ పెద్దగా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపలేక పోయింది.

Advertisement
Samantha Nayanthara Face Backlash Publicity Over Content, Samantha, Nayanatara,

అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సమంత ఈ సిరీస్ కోసం ఫిజికల్‌ గా ఎంతో కష్టపడి పోరాట సన్నివేశాలను కూడా చేసింది.కానీ సమంత చేసిన ఫైట్స్ సీన్స్ కంటే ఇందులోని ఆమె‌ వరణ్ ధావన్‌ తో( Varun Dhawan ) కలిసి నటించిన ఒకటిరెండు రొమాంటిక్ సన్నివేశాల గురించిన ప్రస్తావనే ఎక్కువగా జరిగింది.

Samantha Nayanthara Face Backlash Publicity Over Content, Samantha, Nayanatara,

దీంతో కొందరు సమంతని పబ్లిసిటీ ఫుల్, రిజల్ట్ నిల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు నయనతార పరిస్థితి కూడా ఇలాగే ఉంది.ధనుష్ కాంట్రవర్సీ‌తో అందరి దృష్టి ఆమెపై పడింది.

ఈ నేపథ్యంలోనే ఆమె నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌( Nayanthara: Beyond The Fairytale ) అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది.దీనికి పలు సెలబ్రిటీలు మద్దతు తెలిపిన క్రిటిక్స్, ఆడియెన్స్ మాత్రం తీసి అవతల పడేశారు.

అసలు పెళ్లి క్యాసెట్‌ ను ఓటీటీ‌కి అమ్మాలన్న చీప్ ఆలోచన నయనతారకు ఎందుకు వచ్చిందని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇలా ఇద్దరిపై ట్రోల్స్ చేస్తున్నప్పటికీ నయనతార మీద ఎక్కువగా ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు అభిమానులు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు