రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన సమంత..!!

హీరోయిన్ సమంత( Samantha ) మయోసైటీస్ వ్యాధితో మొన్నటిదాకా బాధపడిన సంగతి తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ వ్యాధి బారిన పడిన సమంత దాదాపు ఐదు నెలలపాటు షూటింగ్స్ కి సెలవు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది.

ప్రస్తుతం కోలుకోవటంతో మళ్లీ షూటింగ్స్ లో మార్చి నెల నుండి బిజీ అవుతూ ఉంది.మొన్ననే విజయ్ దేవరకొండతో చేస్తున్న "ఖుషి" సినిమా కోసం టర్కీలో షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ ధావన్ తో( Varun Dhawan ) "సిటాడెల్ సిరీస్"( Citadel ) షూటింగ్ నిమిత్తం సెర్బియాలో సమంత వెల్లడం జరిగింది.ఇక ఇదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) కూడా అక్కడే పర్యటిస్తూ ఉన్నారు.

దీంతో సమంత, వరుణ్ ధావన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సెర్బియాలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా "సిటాడెల్ సిరీస్" టీం మొత్తం రాష్ట్రపతితో కలిసి ఫోటోలు దిగడం జరిగింది.ఈ ఫోటోలను వరుణ్ ధావన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

రాష్ట్రపతిని కలవటం తమకు ఆనందంగా.గౌరవంగా ఉందని పేర్కొన్నారు.

గతంలో హిందీలో "ఫ్యామిలీ మెన్" సిరీస్ లో సమంతా నటన చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది.దాని మూలంగానే "సిటాడెల్ సిరీస్" అవకాశం వచ్చినట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్.

ఈ వెబ్ సిరీస్ లో సమంతా యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు