సమంత ఛాలెంజ్.. పడిపోయిన ప్రీతమ్.. ఇన్స్టా స్టోరీ వైరల్!

సాధారణంగా సినీ తారలు వారి ఫిట్ నెస్ పై ఎంతో దృష్టి సారిస్తారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటారు.

అలాంటి వారిలో సమంత ముందుంటుంది.ఈమె తన ఫిట్ నెస్ కోసం ఎంతో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ ఆ వర్కౌట్స్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తుంటారు.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సామ్‌ లెవల్‌ అప్‌ అనే కొత్త వర్కవుట్‌ ఛాలెంజ్‌ను విసిరింది.

ముందుగా ఈ చాలెంజ్ తను విజయవంతంగా పూర్తి చేసి ఈమె తన హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా , డిజైనర్ ప్రీతమ్ లకు సామ్ ఈ చాలెంజ్ విసిరింది.ఈ ఛాలెంజ్ లో భాగంగా హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ ఎంతో విజయవంతంగా పూర్తి చేయగా మేకప్ ఆర్టిస్ట్ మాత్రం వెల్లికిలా పడిపోయారు.

Samantha Level Up Challenge Stylist Preetham Jukalker Epic Failure Deets Inside,
Advertisement
Samantha Level Up Challenge Stylist Preetham Jukalker Epic Failure Deets Inside,

ఇక డిజైనర్ ప్రీతమ్ కూడా ఈ చాలెంజ్ ట్రై చేస్తూ ముందుకు పడిపోయారు.ఇలా పడిపోవడంతో సమంత నవ్వు ఆపుకోలేక పోయింది.ఈ క్రమంలోనే సమంత ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అయితే ఈమె తాజాగా యశోద అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే.అలాగే విడాకుల తర్వాత సమంత పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో వినోదాన్ని పంచారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు