తగ్గించుకున్న సమంత

ఈ శుక్రవారం ఉన్న ఊపు వచ్చే శుక్రవారం ఉండకపోవచ్చు సినిమా ఇండస్ట్రీలో.జాతకాలు అలా మారిపోతూ ఉంటాయి.

రెండెళ్ళ క్రితం సమంతకు పోటి ఇవ్వగలిగే కథానాయికే కనబడలేదు తెలుగు ఇండస్ట్రీలో .మరి ఇప్పుడు? కాజల్ ఫామ్ లోకి వచ్చేసింది .తన చేతిలో ఏకంగా సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాలున్నాయి.రకుల్ ప్రీత్ వరుస ఆఫర్లతో అదరగొడుతోంది.

శృతిహాసన్ తో ఎప్పుడు ముప్పే .రెజీనా, రాశీ ఖన్నా లాంటివాళ్ళకు మంచి హిట్ పడితే స్టార్లు అయిపోతారు.మరి మళ్ళీ తన హవా కొనసాగాలంటే ఏం చేయాలి? సమంత తెలివైన అమ్మాయి కాబట్టే సరైన నిర్ణయం తీసుకుంది.తన పారితోషికం తగ్గించేసుకుంది.

బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్, అ.ఆ, కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా, నాగచైతన్య-కళ్యాణ్ కృష్ణ సినిమా.ఇలా దాదాపు అరడజను సినిమాలు తెలుగులో కొట్టేసింది సమంత.

Advertisement

తక్కువ రేటులో అగ్రకథానాయిక వస్తే ఏ నిర్మాత గమ్మున ఉంటాడు.వెంటనే సైన్ చేసేసుకుంటాడు.

ఇప్పుడు అల్లు అర్జున్, లింగుసామి చిత్రంలో కూడా సమంతానే హీరోయిన్ గా అనుకుంటున్నారట.అందానికి తెలివితేటలు కలిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.

మరో రెండు సంవత్సరాల వరకు సమంత స్థానానికి ఢోకా లేదు.

వ్యాధినిరోధక శక్తిని పెంచే ఉత్తమమైన ఆహారాలు
Advertisement

తాజా వార్తలు