ఓరి నాయనో.. సమంత ఎన్ని బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తుందో తెలుసా?

సమంత. ఇది పేరు కాదు ఏకంగా బ్రాండ్ గా మారిపోయింది.

ఎందుకంటే సమంతా కేవలం టాప్ హీరోయిన్ గా కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే పాపులారిటీ సంపాదిస్తూ దూసుకుపోతుంది.ఎన్ని అవాంతరాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ చిరునవ్వుతోనే అందరికీ సమాధానం చెబుతుంది సమంత.

అక్కినేని వారి కోడలిగా మారిన తర్వాత సమంత క్రేజ్ పెరిగిపోయింది అంటూ అనుకునే వారు ఒకప్పుడు అందరు.ఇక అక్కినేని హీరో నాగచైతన్యకు విడాకుల తర్వాత సమంతా కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది అని భావించారు.

సమంత విడాకులకు సిద్ధమవ్వకుండా ఉండాల్సింది అని ఎంతోమంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.విడాకులు తీసుకున్న తర్వాత కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అమ్మడు.

Advertisement
Samantha And Her Brand Endorsements Details, Samantha, Heroine Samantha, Samanth

ఇక ఎన్నో రోజుల పాటు బాధలు మునిగితేలుతోంది అనుకుంటే కొన్నాళ్లపాటు బాధ పడిన తర్వాత మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది.కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ హాలీవుడ్లో సైతం అవకాశాలను దక్కించుకుంటుంది సమంత.

ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు వాణిజ్య ప్రకటనలతో కూడా దూసుకుపోతుంది.

Samantha And Her Brand Endorsements Details, Samantha, Heroine Samantha, Samanth

ఇక ఇప్పుడు సమంత ప్రమోషన్ చేస్తున్న బ్రాండ్ వివరాలు చూసుకుంటే.

చిక్ షాంపూ :

ఇటీవలి కాలంలో చిక్ షాంపూ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది ఈ అమ్మడు.ఇక భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

గోకుల్ శాండివ :

గోకుల్ శాండివ బ్రాండ్ కూడా సమంత బ్రాండ్ ప్రమోషన్ చేయడం ప్రారంభించింది.

Samantha And Her Brand Endorsements Details, Samantha, Heroine Samantha, Samanth
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

బిగ్ సి మొబైల్స్ :

ఇక ప్రస్తుతం టాప్ బ్రాండ్ గా కొనసాగుతున్న బిగ్ సి మొబైల్స్ కి కూడా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంది సమంత

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ :

ఇంకా ఎన్నో రోజుల నుంచి షాపింగ్ మాల్స్ కి బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్న సమంత ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.ఇక వీటితో పాటు శరవణ స్టోర్స్, ఓడోనిల్ రూమ్ ఫ్రెష్ నర్.డాబర్ వాటిక హెయిర్ ఆయిల్, కోల్గేట్ లాంటి బ్రాండ్లకు కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు