Ravi Basrur: ఒకప్పుడు కిడ్నీ అమ్మాలనుకున్నాడు.. ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. సలార్ రవి బస్రూర్ గురించి ఈ విషయాలు తెలుసా?

మ్యూజిక్ డైరెక్టర్ రవి బ‌స్రూర్‌( Music Director Ravi Basrur ) గురించి మనందరికీ తెలిసిందే.ప్ర‌స్తుతం టాప్ టెక్నీషియ‌న్‌ గా రాణిస్తున్నాడు రవి.

అంతేకాకుండా సంగీత ద‌ర్శ‌కుడిగా కోట్లు సంపాదిస్తున్నారు.పెద్ద పెద్ద హీరోలంతా ర‌వి బ‌స్రూర్‌నే త‌మ సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకోవాల‌ని ఆశ ప‌డుతున్నారు.

అయితే నేడు ఈ స్థాయిలో ఉండడానికి రవి ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడటీ.ఆయన కష్టాలు తెలిస్తే మాత్రం కన్నీళ్లు ఆగవు.ప్రస్తుతం కోట్లకు కోట్లు సంపాదిస్తున్న రవి ఒకప్పుడు కీబోర్డు కోసం తన కిడ్నీని అమ్మాలనుకున్నాడు అంటే ఎంతటి కష్టాలను అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

ట్రైన్ టికెట్ కి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో బాత్రూమ్‌లో దూరి, బిక్కు బిక్కుమంటూ ప్ర‌యాణం చేశాడట.కాగా ర‌వి బ‌స్రూర్( Ravi Basrur ) అస‌లు పేరు కిర‌ణ్‌.

Advertisement

( Kiran ) క‌ర్నాట‌క‌లోని బ‌స్రూర్ అనే గ్రామంలో పుట్టాడు.య‌క్ష‌గానాలు పాడుకొనే వంశం వాళ్ల‌ది.

క్ర‌మంగా య‌క్ష‌గానాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌డంతో కుటుంబమే ఒక సంగీత బృందంగా మారిపోయింది.మ్యూజిక్ ఆల్బ‌మ్స్( Music Albums ) రూపొందించేది.

అయితే కుటుంబంలో క‌ల‌హాల వ‌ల్ల‌, అంతా విడిపోయారు.కిర‌ణ్‌కి క‌మ్మ‌రి ప‌నిలో ప్ర‌వేశం ఉండ‌డంతో అటు వైపు వెళ్లాడు.

కానీ మ‌న‌సంతా సంగీతం పైనే.కీ బోర్డు( Key Board ) అద్దెకు తెచ్చుకొని సాధ‌న చేసేవాడు.

ఆప‌నీ ఈ ప‌నీ చేసుకొంటూ పాతిక వేలు సంపాదించిన కీ బోర్డు కూడా కొన్నాడు.ముంబై వెళ్లి అక్క‌డ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు.

Advertisement

ఈలోగా అంధేరీలోని ఒక ప‌బ్బులో ( Pub ) పాట‌లు పాడే ఛాన్స్ వ‌చ్చింది.జీవ‌నోపాధి కోసం అక్క‌డ ప‌నికి కుదిరాడు.అయితే ఒక రోజు త‌న సంగీత ప‌రిక‌రాల‌న్నీ ఒక బ్యాగులో వేసుకొని థానే లోని లోక‌ల్ రైల్వే స్టేష‌న్ కి వ‌చ్చాడు.

స‌రిగ్గా అప్పుడే ఆ స్టేష‌న్‌పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు ఎగ‌బ‌డ్డారు.పోలీస్ క‌మాండోలు రంగ ప్ర‌వేశం చేశారు.కిర‌ణ్ బ్యాగుతో స‌హా క‌నిపించ‌డంతో అనుమానించిన కమాండోలు క‌మ్యునికేష‌న్ గ్యాప్ వ‌ల్ల‌ ఆ బ్యాగ్ ని నేల‌కేసి కొట్టారు.

దాంతో సంగీత ప‌రిక‌రాల‌న్నీ ధ్వంసం అయిపోయాయి.ఆ త‌ర‌వాత కిర‌ణ్ అమాయ‌కుడ‌ని భావించి పోలీసులు వ‌దిలేశారు.

అప్ప‌టికే పోలీసుల దెబ్బ‌ల‌కు స్పృహ కోల్పోయిన కిర‌ణ్‌ అటు వైపు వ‌చ్చిన ఆగిన ఒక ట్రైన్ ఎక్కేశాడు.కానీ టికెట్ కొన‌లేదు.టీసీ ఎక‌క్క‌డ వ‌స్తాడో అని భ‌య‌ప‌డి, బాత్రూల్‌లోకి వెళ్లి దాక్కుని, బిక్కు బిక్కుమంటూ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింది.

ఇంటికొస్తే అప్పుల బాధ‌.సంగీత ప‌రిక‌రాల కోసం డ‌బ్బులు కావాలి.

ఆ స‌మ‌యంలో త‌న కిడ్నీ అమ్మ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని భావించి ఒక బ్రోక‌ర్‌ని కూడా సంప్ర‌దించాడట.మొత్తం రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు బేరం కుదిరింది.

ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌కుండా ఆసుప‌త్రిలో చేరాడు.ఇంకాసేప‌ట్లో ఆప‌రేష‌న్ అన‌గా భ‌య‌ప‌డి అక్క‌డి నుంచి పారిపోయాడు.

ఆ ద‌శ‌లో ర‌వి అనే ఒక స్నేహితుడు ఆదుకొన్నాడు.

" autoplay>

తాజా వార్తలు