సలార్ 2 వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఆ వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

త్వరలోనే ఈయన నటించిన కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ప్రభాస్ చివరిగా సలార్ (Salaar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth neel ) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఈ సినిమా రెండు భాగాలకు ప్రేక్షకుల ముందు కూడా రాబోతుంది అనే విషయం మనకు తెలుస్తుంది.మొదటి భాగం గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక త్వరలోనే రెండో భాగం కూడా రాబోతుందని ప్రకటించారు.కానీ ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండవ భాగం షూటింగ్ ఆగిపోయింది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి ఇలా సలార్ 2 ( Salaar 2 )గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో మేకర్స్ ఈ వార్తల స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

సలార్ 2 రూమర్ల పై హోంబలే ఫిల్మ్స్‌ స్పందిస్తూ సెట్స్‌లో ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ నవ్వుతూ కనిపించిన దృశ్యాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.వారు నవ్వకుండా ఉండలేరు అంటూ పరోక్షంగా రూమర్స్‌ని ఖండించింది.ఇలా మేకర్స్ స్పందించి ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇది కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు నిర్మాతలు వెల్లడించారు.

కల్కి విడుదలైన అనంతరం రాజసాబ్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ప్రశాంత్ సినిమా పనులలో ప్రభాస్ బిజీ కానున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభాశాలి.. కొరియోగ్రాఫర్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు