క్రిస్మస్ సినిమాల ప్రమోషన్‌ హడావుడి ఎక్కడ భయ్యా...!

క్రిస్మస్ కి( Christmas ) ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సలార్‌ సినిమా( Salaar ) విడుదల అవ్వబోతుంది.

అంతే కాకుండా షారుఖ్‌ ఖాన్‌, రాజ్ కుమార్‌ హిరాణి కాంబోలో రూపొందిన డంకీ సినిమా( Dunki ) కూడా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.

ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా పది రోజుల సమయం కూడా లేదు.కానీ ఇప్పటి వరకు ప్రమోషన్ లో జోరు కనిపించడం లేదు.

ఇప్పటికే వచ్చిన ప్రమోషన్‌ చాలు అనుకుంటున్నారో లేదా మరేదైనా ఆలోచనలో ఉన్నారో కానీ ఇప్పటి వరకు ప్రమోషన్ లో స్పీడ్‌, జోరు కనిపించడం లేదు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాల వసూళ్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉంది.

కనుక ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది.సలార్‌ మేకర్స్‌ విడుదల చేసిన ట్రైలర్‌ కి( Salaar Trailer ) ఏకంగా 150 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి.కనుక అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

అంతే కాకుండా ప్రభాస్( Prabhas ) గత చిత్రాల ఫలితాలు మరియు కేజీఎఫ్‌ ఇమేజ్ కారణంగా సలార్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కనుక సలార్‌ కి ప్రమోషన్‌ చేయాలని వారు భావించడం లేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సలార్‌ సినిమా ప్రమోషన్‌ కోసం ను చివరి వారంలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.డంకీ కి సంబంధించిన ప్రమోషన్ ను మెల్లగా చేస్తూనే ఉన్నారు.ఆ మధ్య షారుఖ్( Shahrukh Khan ) ఎక్స్ లో అభిమానులతో చిట్‌ చాట్ చేశాడు .అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఇతర మీడియాలో డంకీ గురించి చిట్ చాట్‌ లు చేస్తున్నాడు.కనుక డంకీ ప్రమోషన్స్ మెల్లగా జరుగుతున్నాయి.

త్వరలో స్పీడ్‌ పెరిగే అవకాశం ఉందంటున్నారు.ఈ రెండు సినిమా లు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు