సజ్జల షాడో ముఖ్యమంత్రి... ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్స్

నెల్లూరు రూరల్ లో తన అనుచరుల అరెస్టును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు.ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జలపై ధ్వజమెత్తారు.

సజ్జల రామకృష్ణారెడ్డి షాడో ముఖ్యమంత్రి అని కోటంరెడ్డి ఆరోపించారు.అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు.సజ్జల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు.

అంతేకాకుండా తనపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు.

Advertisement

తాటి వెంకటేశ్వర్లును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు.లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు