తెలంగాణలో చంద్రబాబు యాత్రపై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో చాలాకాలం తర్వాత నిన్న ఖమ్మం జిల్లాలో చంద్రబాబు టీటీడీపీ పార్టీ తరఫున భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.

ఈ సభకు ఎన్నడూ లేని రీతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

దారి పొడవునా చంద్రబాబు కాన్వాయ్ కి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.దీంతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ అలానే ఉందని రుజువు చేయడం జరిగింది.

Sajjala Ramakrishna Reddy's Serious Comments On Chandrababu Yatra In Telangana,

మొట్టమొదటిసారి కాసాని జ్ఞానేశ్వర్ నీ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభ కావటంతో.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణలో చంద్రబాబు యాత్రలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకి అలవాటే అని అన్నారు.ఆయనకు క్లారిటీ లేదు.

బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని.ప్రజలు నమ్మలేదు.

కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు.ఈ రకంగా బీజేపీకి దగ్గర అవ్వడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విపరీతమైన తలనొప్పిని కూడా ఇట్టే పోగొట్టే మ్యాజికల్ డ్రింక్ ఇది..!
Advertisement

తాజా వార్తలు