Sai pallavi : ఆ సినిమా తర్వాత భయమేసి జార్జియా వెళ్ళిపోయాను : సాయి పల్లవి

సాయి పల్లవి( Sai pallavi ).చాలా మంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చెప్తూ ఉంటారు కానీ నిజమైన డాక్టర్ అయిన సాయి పల్లవి నటిగా అవ్వాలని మాత్రం ఏ రోజు అనుకోలేదు.

ఎంతో చక్కగా డాన్స్ చేయగలిగే సాయి పల్లవి డి వంటి రియాల్టీ షోలో( D reality show ) సైతం పాల్గొని ఆ తర్వాత ఆమె ఇంటర్ అయిపోగానే మెడిసిన్ చేయడానికి జార్జియాకి( Georgia ) వెళ్ళిపోయింది.తన చిన్నతనం నుంచి త్రిష సిమ్రాన్ లాంటి వారిని చూసి పెరిగానని, వారిలాగా అందమైన బాడీ తనకు లేదని వారిలాగా తను అందగత్తెను కాదని ఎప్పటికీ అప్పుడు తనకు తాను సర్ది చెప్పుకునే దానిని అంటూ ఓసారి మీడియాతో సాయి పల్లవి తెలిపింది.

జార్జియాలో సైతం చుట్టూ ఉండే జనాలు చాలా తెల్లగా ఉంటారని ఇక వారిలాగా నాకు తెలుపు రంగు రాలేదని అలాగే నా మొహం అంతా కూడా పింపుల్స్ ఉంటాయని నన్ను ఎవరు ఇష్టపడరు అని అనుకుంటూ ఉండే దానిని అంటూ తెలిపింది సాయి పల్లవి.అయితే అల్ఫొన్స్ ప్రేమమ్ సినిమా కోసం తనను పిలిచినప్పుడు జార్జియా నుంచి చాలా నర్వస్ గా వచ్చానని అసలు సినిమా ఇండస్ట్రీ తనకు ఏ మాత్రం సూట్ కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని అంటూ తెలిపింది.ఇక ప్రేమమ్ సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు చేసి ఆ సినిమా విడుదల అవ్వక ముందే తాను జార్జియా వెళ్ళిపోయానని విడుదలైన రోజు ఖచ్చితంగా అందరూ నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటారని ట్విట్టర్ కూడా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.

కానీ విడుదలైన తర్వాత అన్న పింపుల్స్ మొహాన్ని అందరూ ఇష్టపడ్డారని, సిమ్రాన్ లాగా, త్రిష లాగా తనకు ఫిగర్ లేకపోయినా నన్ను ఒప్పుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, నేచురల్ గా ఉండే మన ఇండియన్ కలర్ ని మన వారందరూ ఇష్టపడతారని అప్పుడే తెలుసుకున్నానని, నన్ను నన్నుగా ప్రేమిస్తున్న వారందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పింది సాయి పల్లవి.సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది.ఆమె డేట్స్ కోసం ఎంతోమంది అమే ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు