Sai Dharam Tej : ఆ ప్రమాదం పీడకల కాదు స్వీట్ మెమొరీ.. యాక్సిడెంట్ పై సాయిధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) గురించి మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ లో తక్కువ సినిమాలలో నటించినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

కాగా సాయి ధరమ్ తేజ్ 2021లో బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.హైటెక్ సిటీ నుంచి దుర్గం చెరువు వైపుకు రాయదుర్గం మార్గంలో తన బైక్ పై వెళుతుండగా రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా అతని బైక్ స్కిడ్ ( Bike skid )అయిన విషయం తెలిసిందే.

ఆ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆ గాయాలా నుంచి కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది.ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదట చిత్రం విరూపాక్ష( Virupaksha ).ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు.

Advertisement

సాయి ధరమ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ తన యాక్సిడెంట్ విషయం గురించి స్పందించారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.తాను ప్రమాదానికి గురైన సమయంలో తల్లిదండ్రులు దగ్గర నుంచి అభిమానుల వరకు ఎంతో మంది తాను కోలుకోవాలని ప్రార్థించారని వారి ప్రార్థనల కారణంగానే బతికి బయటపడ్డాను అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

తాను ఆర్థికంగా సంపాదించిన డబ్బు గురించి పక్కన పెడితే ప్రేక్షకుల అభిమానాన్ని సాధించగలిగాలని, జీవితంలో తనకు అంతకంటే మరేం కావాలి అని తెలిపారు సాయి ధరమ్ తేజ్.అయితే తనకు యాక్సిడెంట్ అయిన సమయంలో కొందరు దారుణంగా ట్రోలింగ్స్ చేశారని.ఏదో జోకులు వేయాలి అన్న ఉద్దేశంతో నీ పని అయిపోయిందా? రిటైర్మెంమెంటేనా అంటూ ట్రోల్స్ చేశారు.ఆ ట్రోల్స్ కి నేనేమీ బాధపడలేదు.

ప్రమాదం కూడా తనకి ఎప్పుడూ ఒక పీడకల కాదని.ఒక స్వీట్ మెమోరీ అని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

భవిష్యత్తులో సరైన విధంగా ఆలోచించడానికి ఆ ప్రమాదం ఒక మంచి గుణపాఠం కింద ఉంటుంది అని నేను వాళ్లకి తెలిపాను అని చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్.కాగా సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు