Sagara Sangamam : సాగర సంగమం సినిమా సమయం లో కమల్ హాసన్ నాన్ వెజ్ తినకపోవడానికి కారణం ఏంటి..?

కళాతపస్వి కే విశ్వనాథ్( K Vishwanath ) తెలుగులో చాలా ఆర్ట్ సినిమాలను తీశాడు.

ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక కళాఖండం మిగిలిపోయిందనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఆ కళ ను స్క్రీన్ పైన డెలివరీ చేస్తాడు.అంతా డెడికేషన్ తో వర్క్ చేస్తారు కాబట్టే ఆయనకి ఎక్కువ సక్సెస్ లైతే వచ్చాయి.

ఇక అందులో భాగంగా ఆయన ఎక్కువ సినిమాలు కమల్ హాసన్( Kamal Haasan ) చేసే ప్రయత్నం అయితే చేశారు.ఎందుకంటే అప్పట్లో ఆర్ట్ సినిమా చేయాలంటే అది కమలహాసన్ మాత్రమే చేయగలడు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.

Sagara Sangamam

కాబట్టి ఆయన రాసుకున్న కథలు కమల్ కి మాత్రమే సెట్ అవుతాయని ఆయనతోనే ఎక్కువ సినిమాలు చేశాడు.ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సాగర సంగమం సినిమా( Sagara Sangamam ) సమయం లో కమలహాసన్ ఆ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు నాన్ వెజ్ తినలేదట.ఎందుకంటే అందులో కూచిపూడి, భరతనాట్యం, కథక్ లాంటి ఎన్నో రకాలైన డాన్స్ లు చేయాల్సి ఉంటుంది.

Advertisement
Sagara Sangamam-Sagara Sangamam : సాగర సంగమం సినిమ�

ఇక నాన్ వెజ్( Non Vegetarian ) తినడం వల్ల బాడీలో కొవ్వు కొంచెం ఎక్కువగా పేరుకు పోయి డాన్స్ చేయడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమా పూర్తయ్యేంత వరకు నాన్ వెజ్ ముట్టకుండా, ఓన్లీ వెజ్ మాత్రమే తింటూ ఈ సినిమా కోసం చాలా డెడికేషన్( Dedication ) తో వర్క్ చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూ తెలియజేశాడు.

Sagara Sangamam

ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా ఎవరికి లేని గుర్తింపు కూడా ఈ కాంబినేషన్ కి వచ్చిందనే చెప్పాలి.ఇక వీళ్లిద్దరూ ఇండస్ట్రీ లో చాలా సెపరేట్ పేరు ను అయితే సంపాదించుకున్నారు.ఇక మొత్తానికి వీళ్ళ వల్ల మన కళలు, సంస్కృతులు నెక్స్ట్ జనరేషన్ కి తెలిసే అవకాశం దక్కింది.

Advertisement

తాజా వార్తలు