పబ్జీతో మరో యువకుడి బలి.. ఆలస్యంగా వెలుగులోకి !

దేశంలో కరోనా విజృంభణ కొసాగుతూ ఉండటంతో పిల్లలు అందరు ఇంటికే పరితమైయ్యారు.ఇంటి నుండి బయటికి వెళ్లకపోవడంతో ఆన్ లైన్ గేమ్స్ కి బానిసైయ్యారు.

ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడిన యువత అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు.ఇక చాల మంది యువత ఆన్ లైన్ గేమ్స్ లో బెట్టింగ్స్ పెట్టి అప్పుల పాలవుతున్నారు.

అంతేకాక మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇక పబ్జీ గేమ్ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా పబ్జీ గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.నగరంలో రెవెన్యూ కాలనీలో తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి నివాసం ఉంటున్నారు.

చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ కరోనా కారణంగా ఇంటికి వచ్చాడు.అతడు కాలేజ్ లో చదువుతున్న సమయంలో పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఇంటిపైన ఉన్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కిరణ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఇంటిపై నుండి దుర్వాసన రావడంతో తల్లిదండ్రులు గది తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్ విగతజీవిగా పడి ఉన్నాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

విగతజీవిగా కొడుకుని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తాజా వార్తలు