పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది... తమన్ సంచలన వ్యాఖ్యలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరం అవుతూ రాజకీయాలలో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

జనసేన పార్టీని(Janasena) స్థాపించిన ఈయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సాధించిన నేపథ్యంలో ఇప్పటికీ ఈయన కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేయటానికి ఆలస్యం అవుతుంది.

తనకు వీలైనప్పుడల్లా ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమాలలో ఓజీ(OG) సినిమా కూడా ఒకటి.

సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

S.s.taman Interesting Comments On Pawan Kalyan Og Movie , Pawan Kalyan,og Movie,

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల నిమిత్తం ఎలాంటి బహిరంగ సభ నిర్వహించిన సరే అభిమానులు మాత్రం ఓజీ సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ కేకలు వేస్తుంటారు.ఇలా అభిమానుల ప్రవర్తన పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.అభిమాన నటుడిని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా తెరపై ఎప్పుడు చూడాలా అంటూ అభిమానులు ఆతృత కనబరుస్తున్నారు.

Advertisement
S.S.taman Interesting Comments On Pawan Kalyan OG Movie , Pawan Kalyan,OG Movie,

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఎస్ఎస్ తమన్(S.S.Taman) ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.

S.s.taman Interesting Comments On Pawan Kalyan Og Movie , Pawan Kalyan,og Movie,

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.పవన్ కల్యాణ్ ను ఓజీ పాత్రలో చూస్తుంటే నా రక్తం మరుగుతోంది.ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే రక్తం ఉరకలేస్తోంది.

పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ చాలు పిచ్చి ముదిరి పీక్స్ కు చేరడానికి.నేను ఈ సినిమా కోసం అన్ని మ్యూజిక్ పరికరాలను కూడా మార్చేశానని తెలిపారు.

ఇక నా ఎనర్జీ తగ్గకుండా ఉండటం కోసం గది మొత్తం పవన్ కళ్యాణ్ పోస్టర్లతో నిండి ఉందని తెలిపారు.ఓజీ మ్యూజిక్ మీ ఊహకు అందనంతలా ఉండేందుకు కృషి చేస్తున్నా అంటూ ఈ సినిమా గురించి తమన్ చేసిన ఈ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు