అక్టోబర్ 1 ఎన్నారైలకి గడ్డు కాలమేనా..?

అగ్రరాజ్యం అమెరికా ఎన్నారైల మెడలపై కత్తి పెడుతోంది.వీసా ల పేరు చెప్పు ముప్పుతిప్పలు పెడుతోంది.

రోజుకో వార్తని వెల్లడిస్తూ ఎన్నారైలలో టెన్షన్ వాతావరం నిపుతోంది.అయితే తాజాగా వీసా విధానంలో కొత్త నిభందనని ప్రవేసపెట్టింది.

అదేంటంటే వీసా పొడగింపు.లేదా స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకుని తిరస్కరణకు గురైన వలసదారులను దేశం నుంచి పంపించే ప్రక్రియను అక్టోబర్ 1 నుంచి మొదలుపెట్టనున్నారు.

దరఖాస్తు తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు నోటిసులు పంపించనున్నారు.

Advertisement

ఈ విషయాన్ని యూఎస్ సిటీజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) అధికారులు ప్రకటించారు.అయితే హెచ్-1బీ విషయంలో కాస్తంత ఊరట కలిగించారు.ఉద్యోగ రిత్యా, మానవత్వ కోణాల్లో అందిన పిటీషన్లు, దరఖాస్తుదారులకు ప్రస్తుతానికి నోటిసులు పంపించబోమని ఈ నిబంధనను అమలుచేయనున్న ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించింది.

ఈ నూతన విధానంలో భాగంగా వలసదారులకు పంపించే నోటిసులు క్రమక్రమంగా పెంచుతామని యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది.

నేర చరిత్ర.లేదా మోసాలు.జాతీయ భద్రతకు హాని కలిగించే వ్యక్తులను గుర్తించి నోటిసులకి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

వ్యక్తిగతంగా లెటర్లు పంపించి వివరాలను తెలియజేయనున్నారు.వీసా వివరాలు తిరస్కరణ.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు

దేశం నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలనే అంశాలను నోటిసుల్లో ప్రస్తావిస్తున్నారు.ఇటీవల కాలంలో హెచ్-1బీ వీసా పొడగింపు దరఖాస్తులు చాలా మేరకు తిరస్కరణకు గురయ్యాయి.

Advertisement

ఈ నిభంధన గనుకా పూర్తి స్థాయిలో అమలు అయితే స్వదేశాలకి తిరిగివెళ్ళిపోయే వారిలో అత్యధికులు భారతీయులేనని తెలుస్తోంది.

తాజా వార్తలు