కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ రూబీ ధల్లా?

జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) రాజీనామాతో కెనడాలో కొత్త ప్రధాని పదవికి ఎన్నికల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.

ఇందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా .

భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కూడా ప్రధాని పదవి రేసులో నిలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.తొలుత ప్రధాని ఎన్నికల రేసులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కూడా నిలిచారు.

కానీ అనూహ్య కారణాల మధ్య ఆమె వైదొలగడంతో అంతా షాక్ అయ్యారు.తాజాగా భారత సంతతికి చెందిన మాజీ కెనడా ఎంపీ రూబీ ధల్లా( Ruby Dhalla ) కూడా ప్రధాని రేసులో నిలిచినట్లు ప్రకటించారు.

కెనడా ప్రధాని( Canada PM ) రేసులో నిలవడానికి జనవరి 23 చివరి తేదీ కాగా.దానికి ముందు రోజు రూబీ ధల్లా తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు.

Advertisement
Ruby Dhalla The Indian-origin Ex-MP In Race For Canadian PM Post Details, Ruby D

అయితే .ఆమె అభ్యర్ధిత్వం ఖరారు కావడానికి 3,50,000 కెనడియన్ డాలర్ల రుసుము సమర్పించాల్సి ఉంటుంది.తాను ప్రధానిగా ఎన్నికైతే దేశం నుంచి అక్రమ వలసదారులను( Illegal Migrants ) బహిష్కరించి, మానవ అక్రమ రవాణాదారులను కఠినంగా అణిచివేస్తానని ధల్లా హామీ ఇచ్చారు.

Ruby Dhalla The Indian-origin Ex-mp In Race For Canadian Pm Post Details, Ruby D

మాజీ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ , కేబినెట్ మంత్రి కరీనా గౌల్డ్ , భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య వంటి ప్రముఖులు కెనడా ప్రధాని రేసులో నిలిచారు.ఇప్పుడు ఈ రేసులో రూబీ ధల్లా ఎంట్రీ ఇచ్చారు.రూబీ ధల్లా మానిటోబాలోని విన్నిపెగ్‌లో పంజాబీ వలసదారులకు జన్మించారు.

ధల్లా మొదటిసారిగా 2004లో బ్రాంప్టన్ స్ప్రింగ్‌డేల్ నియోజకవర్గం నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.

Ruby Dhalla The Indian-origin Ex-mp In Race For Canadian Pm Post Details, Ruby D

కన్జర్వేటివ్ నేత నినా గ్రెవాల్‌తో పాటు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళల్లో ధల్లా కూడా ఒకరు.2006, 2008లలో తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికైన రూబీ ధల్లా.2011లో ఓడిపోగా, 2015లో లిబరల్స్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.రాజకీయాల్లోనే కాదు.

"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!

మోడల్‌గానూ రూబీ ధల్లా రాణిస్తున్నారు.ప్రస్తుతం హోటల్ బిజినెస్‌తో వ్యాపారవేత్తగానూ దూసుకెళ్తున్నారు రూబీ.

Advertisement

తాజా వార్తలు