విజయవాడలో ప్రారంభించిన మహా పూర్ణాహుతి కార్యక్రమనికి భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు..!

ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ గాంధీ మున్సిపల్ స్టేడియంలో( Gandhi Municipal Stadium ) నిర్వహిస్తున్న మహాయాగం బుధవారంతో ముగుస్తుంది.

ఉదయం జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) హాజరవుతున్నారు.

మొదటి నుంచి ఇప్పటి వరకు భక్తులు పెద్దగా రాకపోవడంతో ప్రాంగణమంతా ఖాళీగా కనిపించింది.భక్తులు రారన్న విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ భక్తులను తీసుకొని రావడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది.

అలాగే ఈ బాధ్యతను ఆయా జిల్లాలలో ఉన్న దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయ కార్యనిర్వహకులకు అప్పగించింది.

Rtc Buses Arranged For Devotees For Maha Purnahuti Program Started In Vijayawada

మహా పూర్ణాహుతికి సీఎం హాజరవుతున్నందున భక్తులు లేకపోతే పరిస్థితి ఏమాత్రం బాగుండదని గుర్తించిన దేవాలయ శాఖ బుధవారం మరిన్ని బస్సులు ఏర్పాటు చేసింది.విజయవాడకు పక్కన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలు ఉన్నాయి.ఈ జిల్లాలో ఉన్న కార్యనిర్వాహక అధికారులకు దేవదాయ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
RTC Buses Arranged For Devotees For Maha Purnahuti Program Started In Vijayawada

ఈ ఆదేశాలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.దేశంలో ఎక్కడ ఇలాంటి యాగం జరగలేదని కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) ఇప్పటి వరకే నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Rtc Buses Arranged For Devotees For Maha Purnahuti Program Started In Vijayawada

దీనిపై ధార్మిక సంఘాలు ట్రోల్స్‌ చేస్తున్నాయి.ఏమాత్రం భక్తులు రాకుండా ఇలాంటి యాగం ఎక్కడా జరగలేదని ట్రోల్స్‌ చేస్తున్నారు.10 కోట్ల రూపాయలు వేచించి చేస్తున్న ఈ యాగంలో పురోహితులు, పోలీసులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అసలు కనిపించడం లేదు.భక్తులు రావడం లేదన్న విషయాన్ని మాత్రం దేవదాయశాఖ అధికారులు అంగీకరించడం లేదు.

రెండు రోజులుగా వివిధ ప్రాంతాల భక్తులను తరలించడం ప్రారంభించారు.భక్తులు రావడంతో మంగళవారం ప్రాంగణం కాస్త కళా గా అనిపించింది.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?
Advertisement

తాజా వార్తలు