కొత్త రూ.1000 నోటు వచ్చేస్తోంది

నవంబరు 8, 2016 .ఆరోజే అతి సంచలనాత్మక రీతిలో రూ.1000, రూ.

500 నోట్ల మీద బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు నరేంద్ర మోడి.అయితే రూ.2000, రూ.500 కొత్త నోట్లు వస్తాయని ఆదేరోజు ప్రకటించారు.కొత్తరకపు పేపర్ తో, కొత్త సెక్యూరిటీల ముద్రణతో రెండు కొత్త నోట్లు దర్శనమిచ్చాయి.ఆ సమయంలోనే రూ.1000 కూడా కొత్త నోటు రూపంలో తిరిగివస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.ఇప్పుడు అదే నిజమవుతోంది.రూ.1000 డినామినేషన్ తిరిగి చెలామణి అవబోతోంది.ఈసారి కొత్త రూపంలో.

ఈ కొత్త వెయ్యి రూపాయల నోటు ముద్రణ ఇప్పటికే మొదలైందట.త్వరలోనే ఇది బయటకి రానుంది.నిజానికి జనవరిలోనే రూ.1000 కొత్త నోటుని విడుదల చేయాలని ప్రయత్నించారు కాని, రూ.500 నోట్లను ఎక్కువగా అందుబాటులోకి తెచ్చే పనిఒత్తిడిలో వాయిదా వేసారట.రూ.1000 విడుదల కానుండటంపై మిశ్రమ స్పందన లభిస్తోంది.బ్యాన్ చేయడం ఎందుకు, తిరిగి తీసుకురావడం ఎందుకు అని విమర్శలు ఒకవైపు, పాకిస్తాన్ శక్తులు కొత్త నోట్లలో ఉన్న, 17 సెక్యూరిటీ ఫీచర్స్ లో 11 కాపీ చేయడంతో, ఈ కొత్త నోటులో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలనే సూచనలు మరోవైపు వినిపిస్తున్నాయి.నోట్ : చిత్రంలో కనిపిస్తున్న కొత్త రూ.1000 డిజైన్ ఖచ్చితత్వంపై ఈ వెబ్ సైట్ భరోసా ఇవ్వట్లేదు.డిజైన్ లో మార్పులు ఉండవచ్చు.

చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

తాజా వార్తలు