ఆర్ఆర్ఆర్‌ క్లైమాక్స్ ఇదేనట.. గూస్‌బంప్స్‌ ఖాయమంటోన్న ఫ్యాన్స్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అనే విషయంపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

అయితే వీరిద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు అయినా, సినిమాలో మాత్రం వీరిద్దరు కలుసుకుంటారని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి వారిద్దరినీ రాజమౌళి ఎలా కలుపుతాడనేది ప్రస్తుతం చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా ట్రాజెడీగా ముగుస్తుందని తెలుస్తోంది ఈ సినిమాలో ఇద్దరు హీరోలు మరణిస్తారని, వారి మరణాన్ని రాజమౌళి చూపించే విధానం చాలా బాధాకరంగా ఉంటుందని తెలుస్తోంది.ఏదేమైనా రాజమౌళి చిత్రం అనగానే అందరూ కథలు రాసేస్తారనే వార్త మరోసారి నిజమైందని ఆయన అభిమానులు అంటున్నారు.

Advertisement

మరి ఈ సినిమాకు జక్కన్న ఎలాంటి ముగింపును ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు