కొట్టుకుంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు.

ఇక ఈ సినిమాను బాహుబలి దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.ఇక ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ మోషన్ పోస్టర్‌తో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆకలి తీరిందని చెప్పాలి.నిప్పుగా చరణ్, నీరుగా తారక్‌లను చూపిస్తున్న చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేశాడు జక్కన్న.

అయితే అసలు గొడవ ఇక్కడే మొదలైంది.నిప్పు గొప్ప అంటే, లేదు నీరే గొప్ప అంటూ తమ హీరోనే గొప్ప అంటూ అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు.

Advertisement

అయితే వారి మధ్యలో రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఉన్నారు.ఇద్దరు హీరోలకు సమానమైన పాత్రలు ఉంటాయని వారు వాదిస్తున్నారు.

మొత్తానికి మోషన్ పోస్టర్‌తోనే ఇలాంటి వార్‌కు తెరలేపిన ఆర్ఆర్ఆర్ మున్ముందు ఎలాంటి వార్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement