రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి కేవలం రూ. 18 వేలే అని మీకు తెలుసా?

బుల్లెట్‌ బండి పాట గురించి వినని వారు దాదాపుగా వుండరు.ఒక పాట రాసేలా ప్రేరేపించిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.

చాలామంది అబ్బాయిలకు ఇది డ్రీమ్‌ బైక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.భారతీయ మార్కెట్‌లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గేదేలే అన్న మాదిరి వుంది.ప్రస్తుతం మార్కెట్‌లో బుల్లెట్ 350సీసీ బైక్‌ విలువ రూ.2.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందనే విషయం మీకు గుర్తు చేయాల్సిన పనిలేదు.అయితే ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ.18,700 మాత్రమేనన్న విషయం మీకు తెలుసా? అయితే ఇది ఇప్పటి బిల్ కాదండీ, 1986లో దీని ఖరీదు వేలల్లోనే ఉండేది.ఇందుకు సంబంధించిన బిల్లును ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇప్పుడు కూడా కేవలం రూ.10 వేలకే బుల్లెట్ బండిని మీరు మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.ఎందుకంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోటార్‌సైకిల్స్‌పై ఈ స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్లను తీసుకొచ్చింది.రూ.9 వేల నుంచి రూ.12 వేల మధ్యలో డౌన్ పేమెంట్లను కట్టడం ద్వారా మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వెహికిల్‌ను సొంతం చేసుకోవచ్చు.అవును, కేవలం రూ.10,849 డౌన్ పేమెంట్ కడితే చాలు.ఈ బైకు మరుక్షణంలో మీ ఇంటిముందు ఉంటుంది.

కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం.బుల్లెట్ 350(Bullet 350) ఆన్-రోడ్డు ధర రూ.2.16 లక్షలుగా ఉండగా రూ.10,849 డౌన్ పేమెంట్‌ను కట్టడం ద్వారా కస్టమర్లు ఈ బండిని సొంతం చేసుకోవచ్చు.ఆ తర్వాత మూడేళ్ల పాటు ప్రతి నెలా రూ.7,357ను మీరు EMI రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.అంటే ఈ బైకుపై కంపెనీ రూ.2,06,124 రుణాన్ని అందిస్తుంది.

Advertisement
ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!