నిజం అనే ఛానల్ ను స్టార్ట్ చేసిన ఆర్జీవీ...

రాం గోపాల్ వర్మ ( Ram Gopal varma )అంటే ఒకప్పుడు ఆయన తీసిన శివ రంగీలా క్షణ క్షణం సర్కార్ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కానీ ఇప్పుడు ఉన్న వర్మ కంప్లీట్ వేరే గా ఉంటున్నాడు.

ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో కాంట్రవర్సీ ఎక్కడుంటే ఆర్జీవీ అక్కడుంటాడు.

తెలుగు రాష్ట్రాల్లో( Telugu states ) ఎక్కడ ఏ వివాదం చెలరేగినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో, నలుగుర్నీ తనవైపు తిప్పుకోవడంలో వర్మ ఎప్పుడూ ముందుంటాడు.ఈసారి వివేక హత్య కేసు ఈ దర్శకుడ్ని ఎట్రాక్ట్ చేసింది.

Rgv Started The Nijam Channel . Ram Gopal Varma , Nijam Channel, Tollywood ,viv

ఈ కేసుపై మొదటి ఎపిసోడ్ తయారుచేసి, నిజం( Nijam channel ) అనే ఛానెల్ ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు వర్మ.“నేను ప్రారంభించబోయే నిజం అనే ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడమే ఆ బట్టలూడదీసి విసిరి పారేస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది." అంటూ ప్రకటించుకున్నాడు వర్మ.

నిజం చచ్చిపోయినట్టు నటిస్తుంది తప్ప, దాన్ని ఎవ్వరూ చంపలేరంటున్నాడు వర్మ.అలాంటి నిజాల్ని ఇకపై తను చెబుతానని, కేవలం పొలిటికల్ గానే కాకుండా, అన్ని రకాల సబ్జెక్టులు టచ్ చేస్తానని ప్రకటించాడు.

Rgv Started The Nijam Channel . Ram Gopal Varma , Nijam Channel, Tollywood ,viv
Advertisement
RGV Started The Nijam Channel . Ram Gopal Varma , Nijam Channel, Tollywood ,Viv

"నిజం అనే ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి.వాటి గురించి ప్రతి ఎపిసోడ్ లో, నేనే కాకుండా రకరకాల నిపుణులు, ఆలోచనపరులు, రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ ని విశ్లేషిస్తారు." ఇలా కొంతమందితో కలిసి నిజం ఛానెల్ ను ప్రారంభించబోతున్నాడు వర్మ.

వివేకా హత్య వెనక నిజంలో అబద్దముందా ? అనే ఎపిసోడ్ ను నిజం ఛానెల్ లో రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.అయితే వివేక హత్య కేసు గురించి ఏం చెప్పబోతున్నాడు అనేది అందరిలో ఒక ఉత్కంఠ ని అయితే రేపుతుంది అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు