రేవంత్ అమెరికా టూర్ ... భట్టి కి భలే ఛాన్స్ వచ్చింది గా ? 

అవకాశం వచ్చినప్పుడే అల్లుకుపోవాలి అన్న సూత్రం రాజకీయాల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది.

కీలకమైన నాయకుడు అందుబాటులో లేనప్పుడు ఆ తర్వాత స్థానంలో ఉన్న వారే రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటారు.

అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా పైస్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఇప్పుడు అటువంటి అవకాశమే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కు వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు .ఆయన ఆ పర్యటనలో ఉండగానే బట్టి విక్రమార్క నేతృత్వంలోని వర్గం ప్రత్యేకంగా చింతన్ శిబిరం నిర్వహిస్తోంది.      రెండు రోజుల పాటు శిబిర్ లో నవ సంకల్ప శిబిరం పేరుతో మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నారు .మొత్తం ఈ వ్యవహారాన్ని భట్టి విక్రమార్క తన భుజాలపై వేసుకొని బాధ్యతలు తీసుకున్నారు.ఈ సమావేశ బాధ్యతలన్నీ రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్న వర్గం కు చెందిన కీలక నాయకులు తీసుకోవడంతో రేవంత్ వర్గం గుర్రుగా ఉంది.

ఈ శిబిరం నిర్వహణ నిమిత్తం ఆరు కమిటీలను వేశారు ఈ ఆరు కమిటీలకు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి హనుమంత రావు నేతృత్వం వహిస్తున్నారు.నవ సంకల్ప శిబిరంలో అనేక రాజకీయ అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు .   

Advertisement

   అయితే ఇవన్నీ రేవంత్ లేకుండానే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతుండడం పై రేవంత్ వర్గం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది .ముఖ్యంగా రేవంత్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఏలేటి మహేశ్వర రెడ్డి ఈ శిబిరం బాధ్యతలను చూస్తున్నారు.దీంతో రేవంత్ వ్యతిరేక వర్గం అంతా బట్టి విక్రమార్క ను హైలెట్ చేస్తూ ఉండడంతో రేవంత్ హవా కాంగ్రెస్ లో  తగ్గించేందుకు ఆయన వ్యతిరేక వర్గం అంతా  ఈ విధంగా ప్లాన్ చేశారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

జబర్దస్త్ రష్మీకి భారీ షాకిచ్చిన నెటిజన్లు.. మీ టీఆర్పీ స్టంట్లు ఇకనైనా ఆపాలంటూ?
Advertisement

తాజా వార్తలు