క్షేత్ర స్థాయి పర్యటనలపై రేవంత్ ఫోకస్...అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ తరువాత తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

క్షేత్ర స్థాయిలో అంతగా క్యాడర్ లేని బీజేపీ వరుస ఉప ఎన్నికల్లో సత్తా చాటుతున్న తరుణంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన పార్టీగా క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నా పార్టీలో అంతర్గత విభేదాలతో జనంలోకి వెళ్ళకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం కావడంతో చాలా వరకు ప్రజలు కాంగ్రెస్ వెంట నిలబడని పరిస్థితి ఉంది.అందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి ప్రజలు మద్దతు పలికిన పరిస్థితి ఉంది.

అందుకే జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఒక్కసారిగా నలభై సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఉంది.దీంతో అసలు నిజాన్ని గ్రహించిన కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో ప్రజల్లో పర్యటిస్తే తప్ప కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పెరగదనే విషయాన్ని గ్రహించారు.

దీంతో కల్లాల్లోకి కాంగ్రెస్ అనే నినాదంతో క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.తాజాగా రేవంత్ కామారెడ్డి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.

Rewanth Focus On Field Level Tours This Is The Real Strategy
Advertisement
Rewanth Focus On Field Level Tours This Is The Real Strategy-క్షేత్

ఇంకా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే బీజేపీ నిరసనల పట్ల టీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది.ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.

కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పై పెద్దగా టీఆర్ఎస్ విరుచుకపడే పరిస్థితి లేదు.ఇప్పటికె కాంగ్రెస్ ను కెసీఆర్ పరిగణలోకి తీసుకోవడం లేదు కూడా.

ఏది ఏమైనా క్షేత్ర స్థాయి పర్యటనలపై ఫోకస్ పెట్టిన రేవంత్ కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పెంచుకునే  వ్యూహంతో ముందుకు నడుస్తున్న పరిస్థితి ఉంది.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు