రివోల్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ ల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్( Revolt Motors ) భారత మార్కెట్లోకి Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్( Revolt RV400 ) ను విడుదల చేసింది.

రివోల్ట్ మోటార్స్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా RV400 పేరుతో ఈ స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ ఈవీ బైక్ ను లాంచ్ చేశారు.

స్పోర్ట్స్ బైక్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ బైక్ స్టైలిష్ అండ్ డైనమిక్ లుక్స్ తో తీర్చిదిద్దారు.ఈ బైక్ లో స్టైలిష్ లుక్ కలిగిన స్లీక్ బాడీ ను గమనించవచ్చు.

ఈ బైక్ కు ముందు భాగంలో గోల్డ్ కలర్ లో రెండు ఫోర్క్ లను అమర్చారు.ఈ బైక్ లో అమర్చిన స్టైల్డ్ ఎల్ఈడీ హెడ్లైట్ బైకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఈ బైకు బ్యాటరీ బయటకు కనిపించకుండా యాం గులర్ ప్యానల్స్ ను అమర్చారు.

Advertisement

ఈ బైక్ లో మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటర్( Mid-drive electric motor ) ను వాడారు.దీనితో అడవి ప్రాంతంలో కూడా అద్భుతమైన రైట్ ను ఆస్వాదించవచ్చు.ఈ బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను కలిగి ఉంది.

ఫోర్ హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉంది.ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 156 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.ఇందులో ఉండే బ్యాటరీ 3.24 కిలోవాట్- లిథియం- అయాన్- యూనిట్ బ్యాటరీ. ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ద్వారా బ్యాక్ సస్పెన్షన్ హ్యాండిల్ చేస్తుంది.

ఈ బైక్ ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూం ధర రూ.117000/-.ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఆన్లైన్లో ఈ ఈవీ బైక్ ను బుక్ చేసుకోవచ్చు.రివోల్ట్ మోటార్స్ షోరూంలలో కూడా ఈ బైక్ బుక్ చేసుకోవచ్చు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు