బి‌జే‌పి, టి‌ఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ చీఫ్ పదవి కోసం రెండు వర్గాలుగా చీలి తమలో తామే అంతర్గత విమర్శలు చేసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లు ఈ పదవి రేస్ లో ఉన్నారు.

కాంగ్రెస్ అధిస్థానం మాకే టీపీసీసీ చీఫ్ పదవి కట్టబెడుతుందని ఇరు వర్గాలు ఒక్కరికొక్కరు గట్టి నమ్మకంతో ఉన్నారు.కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం రేవంత్ రెడ్డి కే ఆ పదవి దక్కేలాగా ఉంది.

Revanth Reddy Comments On Bjp And Trs Party , Bjp, Kcr, Revanth Reddy, Telangana

ఎందుకు అంటే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బి‌జే‌పి పార్టీ లోకి వెళ్ళుతున్నట్లుగా ప్రకటించడంతో సొంత తమ్ముడినే పార్టీ మారకుండా అడ్డుకోలేకపోయావు, ఇకా పీసీసీ పదవిని ఇస్తే ఎక్కడ కాపాడుతావు అనే విమర్శలు అధిస్థానం నుండి వస్తున్నాయి.తాజాగా రేవంత్ రెడ్డి టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి పార్టీలపై ఘాటైన విమర్శలు చేశాడు.

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసిన కే‌సి‌ఆర్ ఎందుకు స్పందించడంలేదు అన్నాడు.టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి పార్టీలు మొగుడు పెళ్ళాల మాదిరి పగలు కొట్టుకొని రాత్రి కలుసుకుంటారు అన్నాడు.

Advertisement

కే‌సి‌ఆర్ డిల్లీ పర్యటన తర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి అన్నాడు.రైతులు చేబట్టిన భారత్ బంద్ లో పాల్గొన్న కే‌సి‌ఆర్ ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలపై ఎందుకు మౌనం వహిస్తున్నాడని అన్నాడు.

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వేల వేల కోట్లు దోపిడి జరిగిందని కేంద్రం కోరితే ఆధారాలతో సహా నిరూపిస్తాను అన్నాడు.ఆ దమ్ము బి‌జే‌పి చీఫ్ బండి సంజయ్ కి ఉందా అని ప్రశ్నించాడు.

Advertisement

తాజా వార్తలు