చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.ఈ మేరకు హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

రెండు వైపులా వాదనలు ముగియడంతో పిటిషన్ పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో పలు అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ పేర్కొంది.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide