పవన్ సినిమాలో మాజీ భార్య?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను తెరకెక్కిస్తూ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నాడు.

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో నివేదా థామస్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో పవన్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయి నటిస్తున్నట్లు తెలుస్తోంది.పింక్ రీమేక్ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు రేణు దేశాయ్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి రేణు దేశాయ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు