వెంకటేష్ కెరీర్ లో బాగా పేరు తెచ్చి పెట్టిన రీమేక్ సినిమాలు ఇవే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ చేసి ఇక హిట్టు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతోంది అని చెప్పాలి.

కొన్నిసార్లు ఒరిజినల్ సినిమా హిట్ అయిన దానికంటే రీమేక్ చేసిన సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.తెలుగులో కూడా ఇప్పటివరకు చిత్రాలను రీమేక్ సినిమాలు వచ్చాయి.

అయితే టాలీవుడ్లో రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో వెంకటేష్.ఇతర భాషల్లో మంచి గా హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్బస్టర్ హిట్లు అందుకున్నారు విక్టరీ వెంకటేష్.

వెంకటేష్ ఇతర భాషల నుంచి తెలుగులోకి రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలు లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వెంకటేష్ కెరియర్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా సూర్యవంశం.

Advertisement

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు వెంకటేష్.ఆ తర్వాత తమిళంలో సూర్య నటించిన ఘర్షణ మూవీ ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసి మంచి హిట్ సాధించాడు.

ఇక తమిళ్ లో హీరో విక్రమ్ చేసిన జెమిని మూవీ అదే టైటిల్తో తెలుగులో రీమేక్ చేసాడూ.ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.

ఇక ఏ వెడ్నెస్ డే అనే మూవీ ని తెలుగు లో ఈనాడు పేరుతో తీశాడు.తమిళంలో ఇదే సినిమాను రీమేక్ గా కమల్ హాసన్ నటించడం గమనార్హం.ఇక బాలీవుడ్లో హిట్టయిన మూవీ తెలుగులో గోపాల గోపాల అనే టైటిల్ తో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇందులో పవన్ కళ్యాణ్ కూడా నటించడం గమనార్హం.ఇక తమిళంలో హీరో ప్రభు నటించిన హిట్ మూవీ తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు వెంకటేష్.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

తమిళంలో భాగ్యరాజు నటించిన సుందరకాండ తెలుగులో కూడా అదే టైటిల్ తో రీమేక్ చేసి మరో విజయాన్ని సాధించాడు.హిందీలో మాధవన్ నటించిన శాల కదూస్ మూవీ తెలుగులో గురు పేరుతో తీసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

Advertisement

తమిళంలో మంచి హిట్ అయిన దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మోహన్ లాల్ నటించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు.

ఇక నారప్ప సినిమా కూడా ఇలాంటి రీమేక్ సినిమానే కావడం గమనార్హం.ఇలా రీమేక్ సినిమాలతో ఒరిజినల్ సినిమాల కంటే ఎక్కువ విజయాన్ని సాధించాడూ వెంకటేష్.

తాజా వార్తలు