నేత్ర దానం చేస్తున్న ముద్దుగుమ్మ

తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో ముందుకు దూసుకుపోతున్న రెజీనా.

తనకు అందమైన మనస్సు కూడా ఉందని నిరూపించింది.

తాజాగా ఆమె తన రెండు కళ్ళను దానం చేస్తానని అంగీకార‌ప‌త్రంపై సంత‌కం పెట్టింది.ఆ వివరాల్లోకి వెళ్ళితే.

నిన్న మంగళవారం రెజీనా నెల్లూరు లోని అగ‌ర్వాల్ కంటి ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధిగా వచ్చింది.ఆమె ప్రారంభోత్సవం అయినా వెంటనే తన రెండు కళ్ళను దానం చేస్తానని ప్రకటించింది.

అమ్మడి నిర్ణయంతో ఇటు సినీ ప్రముఖులు అటు అభిమానులు రెజీనాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.సరైన సమయంలో అవయవాలు దొరకక చాలా మంది చనిపోతున్నారని, ప్రజలలో అవయవ దానం పట్ల అవగాహనా రావాలంటే సెలబ్రెటీలు అయినా తమ వంటి వారు ముందుకు రావలసిన అవసరం ఉందని ఆమె చెప్పింది.

Advertisement
నేను జిమ్ చేసేది బరువు తగ్గడం కోసం కాదు..నన్ను అలా చూడలేరు : ప్రగతి