Sainikudu : మహేష్ బాబు చేసిన సైనికుడు సినిమా ప్లాప్ కి కారణం ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) చాలా తక్కువ సమయం లోనే తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి సమయంలోనే మహేష్ బాబుకి మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ ని అందించిన దర్శకుడు గుణశేఖర్( Director Gunasekhar ).

వీళ్ళ కాంబో లో ఒక్కడు సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, మూడోసారి సైనికుడు సినిమా( Sainikudu )తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గుణశేఖర్ ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ, ఆ పాయింట్ ను తెరకెక్కించిన విధానం చూసే ప్రేక్షకులను మాత్రం సినిమాకి కనెక్ట్ చేయలేకపోయింది.

అది ఏంటి అంటే హీరోయిన్ విలన్( Villain ) ని ప్రేమించడం అనేది ఈ సినిమా కి పెద్ద మైనస్ గా మారింది.ఇక ఈ పాయింట్ ను వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు.అలాగే గుణశేఖర్ ప్రెజెంట్స్ చేసిన విధానం కూడా అంత పర్ఫెక్ట్ గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిప్పి కొట్టారు.

Advertisement

ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో గుణశేఖర్ చేసిన తప్పు వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని మహేష్ బాబు కొద్దిరోజులు గుణశేఖర్ తో మాట్లాడలేదు అనే వార్తలు కూడా వచ్చాయి.

ఇక మొత్తానికైతే గుణ శేఖర్ ను నమ్మి మూడుసార్లు అవకాశం ఇస్తే అందులో ఒక్కసారి మాత్రమే ప్రూవ్ చేసుకున్నాడు.మిగిలిన రెండు సార్లు డీలాపడిపోయి సినిమాని సక్సెస్ చేయడం విషయం పక్కన పెడితే భారీ డిజాస్టర్ లని ఇచ్చాడు.ఇక అందుకే మహేష్ బాబు మరొకసారి గుణశేఖర్ డైరెక్షన్ లో సినిమా చేసే సాహసం అయితే చేయలేదు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు