బొత్స మాట‌ల్లో అర్థ‌ముందా.. ఏంటీ కామెంట్లు..?

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల‌పై చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.పాఠ‌శాల‌లో పాఠాలు చెప్పే టీచ‌ర్లు ప్ర‌భుత్వానికే పాఠాలు నేర్పుతారా.

? అని ఫైర్ అవుతున్నారు.ఏపీలో విద్యాశాఖ పెద్ద మాస్ట‌ర్ ఎవ‌రు.

బొత్స‌నే క‌దా.మ‌రి ఉపాధ్యాయులు ఎందుకు ఎదురు మాట్లాడుతున్నారు.

అని అనుకుంటున్నారా.ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన 117 ఉత్తర్వు ఏపీలో ఇపుడు మంట పుట్టిస్తోంది.

Advertisement

అసలే సీపీఎస్ రద్దు చేయలేదని మంట మీద ఉన్న ఉపాధ్యాయులకు ఇది మరింత వేడెక్కించింది.ఇక కొద్ది నెలల క్రితం కొత్త పీయార్సీ విషయంలో కూడా ఉపాధ్యాయులే ప్రభుత్వం మీద విమర్శలు సంధించిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలో ఉద్యోగులు సైలెంట్ అయినా ఉపాధ్యాయులు కాంప్ర‌మైజ్ అవ్వ‌లేదు.ఈ క్ర‌మంలోనే ఉపాధ్యాయుల‌కు, ప్ర‌భుత్వానికి గ్యాప్ అయితే పెరిగింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే నూత‌న విద్యా సంవత్సం ప్రార‌భంతోనే స్కూళ్ల‌ను విలీనం చేయడంతో ఉపాధ్యాయుల్లో అస‌హ‌నం పెరిగిపోయింది.అయితే ఈ విలీనం వ‌ల్ల చాలా పాఠశాలలు కనుమరుగు అయ్యాయి.

అదే విధంగా విలీనం చేసిన హైస్కూళ్లు చాలా దూరంగా ఉన్నాయి.దీంతో తల్లిదండ్రులు కూడా మండిప‌డుతూ వ్య‌తిరేకించ‌డంతో వారికి మద్దతుగా టీచర్లు రోడ్డు మీదకు వచ్చారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అయితే ప్ర‌భుత్వ ఉద్యోగులైన టీచ‌ర్లు సర్కార్ విధానాలను సవాల్ చేసేలా మాట్లాడుతుండ‌టంతో బొత్స గుస్సా ఐతున్నారు.ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ఏంటని మండిప‌డుతున్నారు.

Advertisement

సంస్క‌ర‌ణ‌ల ఫలితాల‌కు టైమ్ ప‌డుతుంది.

ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా.? ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ అవసరం లేదంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు.? అంటూ నిల‌దీస్తున్నారు.విద్యా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టే హక్కు ఉపాధ్యాయులకు ఎక్క‌డిద‌ని అంటున్నారు.

ఈ విధానంపై పిల్లల పేరెంట్స్ ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదని.దీని వెనక ఎవ‌రో కుట్ర చేస్తున్న‌ర‌ని.అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు అమలు చేస్తున్నామని.వీటి ఫలితాలు వచ్చేందుకు కాస్త సమయం పట్టదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

అలాగే టీచ‌ర్లు లేవనెత్తిన‌ అంశాలను పరిశీలిస్తున్నామ‌ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.మ‌రి టీచ‌ర్లు చెప్పింది ఫ‌లో అవుతారో లేదో వేచిచూడాల్సిందే.

తాజా వార్తలు