రియల్ మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే, డిజైన్ మామూలుగా లేవుగా..!

రియల్ మీ జీటీ నియో 6 ఎస్ఈ( Realme Gt Neo 6 Se ) స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లో లాంఛ్ అయింది.

ప్రపంచంలోనే మొదటిసారి 8T LTPO OLED డిస్ ప్లే తో వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే.

నియో సిరీస్ లో లాంఛ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్ ఇది.ఈ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందాం.

రియల్ మీ జీటీ నియో 6ఎస్ఈ:

ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5k 8T LTPO OLED డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్, 360హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ఆపరేటింగ్ సిస్టం ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఇందులో 3D కూలింగ్ సిస్టమ్ అందించారు.కెమెరా విషయానికి వస్తే.

50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలు, వీడియోల కోసం 32 మెగా పిక్సెల్ సోనీ IMX 615 ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 100W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.జియో మ్యాగ్నెటిక్ సెన్సార్,( Geo Magnetic Sensor ) లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, అండర్ స్క్రీన్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సేలరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరో స్కోప్ లాంటి వాటితో పాటు వస్తుంది.

Advertisement

ఈ స్మార్ట్ ఫోన్ 4 వేరియంట్ లలో అందుబాటులో ఉంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1699 యువాన్లు, మన భారత కరెన్సీలో సుమారుగా రూ.18000.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1899 యువాన్లు.16GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2099 యువాన్లు.16GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2299 యువాన్లు.ఏప్రిల్ 17వ తేదీ చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

భారత మార్కెట్లో త్వరలోనే విడుదల అవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు