నవరాత్రుల్లో మూడో రోజు పూజ సమయంలో.. ఈ కథను వింటే ఏమవుతుందో తెలుసా..?

నవరాత్రులలో మూడో రోజున చంద్రఘంటా దేవిని( Chandraghanta Devi ) పూజిస్తారు.

అయితే ఆరోజు మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తులు కోరిన కోరికలన్నీ కూడా వీలైనంత త్వరగా నెరవేరుతాయని అందరు నమ్ముతారు.

అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కూడా కలుగుతాయి.ఇక చంద్రఘంటా దేవి అనుగ్రహం పొందాలంటే ఆ తల్లిని సక్రమంగా ఆరాధించాలి.

అంతే కాకుండా పూజ సమయంలో వ్రత కథను కచ్చితంగా పఠించాలని పండితులు చెబుతున్నారు.ప్రాచీన కాలంలో మహిషాసురుడు( Mahishasurudu ) అనే ఓ భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు.

అతను భగవంతుడు ప్రసాదించిన అజయ శక్తితో మహిషాసురుడు చాలా శక్తివంతుడు అయ్యాడు.

Read This Chandraghanta Devi Vrata Katha On The Third Day Of Navaratri Details,
Advertisement
Read This Chandraghanta Devi Vrata Katha On The Third Day Of Navaratri Details,

అయితే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం స్వర్గంపై పెత్తనం చలాయించడానికి చూశాడు.ఆ రాక్షసుడు స్వర్గ సింహాసనాన్ని అధిష్టించాలని అనుకున్నాడు.అలాంటి సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి( Brahma ) వద్దకు వెళ్లి సహాయం కోరారు.

అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడిని ఓడించడం సులభం కాదని దీనికోసం పరమేశ్వరుడు సహాయం తీసుకోవాలని చెప్పారు.అప్పుడు దేవతలందరూ విష్ణువు( Mahavishnu ) వద్దకు వెళ్లడంతో ఆయన సమ్మతితో పరమేశ్వరుడిని కలవడానికి కైలాసానికి చేరుకున్నారు.

అప్పుడు దేవతలందరూ కలిసి మహిషాసురుడు చేస్తున్న రాక్షస చేష్టలన్నీ శివుడికి వివరించారు.అతనికి కచ్చితంగా శిక్ష పడుతుంది అని శంకరుడు అన్నారు.అయితే మహిషాసురుడి చేష్టల వలన మహావిష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడికి చాలా కోపం వస్తుంది.

అప్పుడు వాళ్ళ కోపం నుండి ఒక తేజస్సు కనబడుతుంది.

Read This Chandraghanta Devi Vrata Katha On The Third Day Of Navaratri Details,
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఆ శక్తి వాళ్ళ నోటి నుంచి బయటకు వచ్చి ఒక దేవతగా ప్రత్యక్షమవుతుంది.ఆ సమయంలోనే శివుడు( Mahashiva ) తన త్రిశూలాన్ని అమ్మవారికి ఇస్తాడు.ఇక మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు.

Advertisement

ఇక ఇంద్రుడు తన సమయాన్ని ఇస్తాడు.ఈ విధంగా దేవతలు అందరూ తమ ఆయుధాలను ఆ అమ్మవారికి ఇస్తారు.

అప్పుడు చంద్రఘంటా దేవి త్రిమూర్తుల అనుమతి తీసుకుని మహిషాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతోంది.చంద్రఘంటా దేవి మహిషాసురుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని అందులో చంద్రఘంటాదేవి మహిషాసురుడిని ఓడించిందని చెబుతారు.

అందుకే చంద్రఘంటాదేవి అనుగ్రహం లభించేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ కథను వినాలి.

తాజా వార్తలు