జగన్ కి రామోజీకి మళ్ళీ చెడిందా...

రాజాకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే జగన్ మోహన్ రెడ్డి కి మాత్రం ఎందుకు తెలియడం లేదు అంటున్నారు వైసీపీ నేతలు అయితే తమలో తాము మధన పడుతున్నారు తప్ప బయటకి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదట సరే ఇంతకీ జగన్ రాజకీయ పరిజ్ఞానం గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ వచ్చింది అంటే.

దానికి కారణం లేకపోలేదు.

వివరాలలోకి వెళ్తే.ఈనాడు సంస్థల అధిపతి.

రాజగురువుగా పిలవబడే “రామోజీరావు” తో మొదటి నుంచీ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అస్సలు పెడేది కాదు రామోజీ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉండేవారు.

వైఎస్ ముఖ్యమంత్రి అవ్వక ముందునుంచీ కూడా వారితో వైరం ఉంటూనే ఉంది.అందుకే వైఎస్ తానూ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రామోజీ రావుని ఎలా అయినా రోడ్డుమీదకి రాగాలని విశ్వప్రయత్నాలు చేసేవారని అందుకు తగ్గట్టుగానే ఎన్నో కేసులు బనాయించారు పలు మార్గాలు వెతికి కొన్నాళ్లు ఇబ్బందులు పెట్టారు.

Advertisement
Re Break Up Between Ys Jagan And Ramoji Rao-జగన్ కి రామోజ
Re Break Up Between Ys Jagan And Ramoji Rao

ఆ తరువాత.వైఎస్ మరణం తరువాత జగన్ కూడా రామోజీతో డీ అంటే డీ అంటూ ఉండేవాడు జగన్ వారసత్వంగా వచ్చిన.వైరాన్ని జగన్‌ కొనసాగించారు.

సాక్షి పత్రిక ద్వారా రామోజీ కి వ్యతిరేకంగా వార్తలు రాయడమే కాకుండా రామోజీ పరువు తీసేవిధంగా ఎన్నో బొమ్మలతో కూడిన కధనాలు ప్రచురించాడు.అయితే ఆ తరువాత పరిస్థితులకి అనుగుణంగా రామోజీ తో కే రాజీ కి వచ్చిన జగన్ వంగి వంగి దణ్ణాలు పెడుతూ సంధి చేసుకున్నాడు.

అయితే ఈ సంధి గత కొంత కాలంగా సాగుతూనే ఉంది.అయితే జగన్ మూడ్ ఎప్పుడు మారుతుందో తెలియదు అంతేకాదు ఎక్కడ ఎదగాలో తెలిసిన జగన్ కి ఎక్కడ తగ్గాలో తెలియక పోవడంతోనే గత ఎన్నికల్లో సిఎం అవ్వాల్సిన వాడు కుర్చీ జార్చుకున్నాడు అని అంటుంటారు.

అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ కి రామోజీ కి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ రామోజీని టార్గెట్ చేస్తూ జగన్ తన పత్రికలో రాజగురువు అంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు.తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్‌లు పొత్తుకు తహతహలాడుతున్నాయని.

ఆ పొత్తు కోసం రామోజీరావు ప్రయత్నాలు చేస్తున్నారని.ఈ మధ్యకాలంలో సాక్షి ప్రచురించింది కూడా అంతేకాదు గతంలో రాజగురువు అంటూ పదే పదే చెప్పిన సాక్షి మళ్లీ.

Advertisement

అదే పదాన్ని ప్రయోగిస్తోంది అయితే సాక్షిలో ఈ తరహా మార్పు రావడానికి కారణం ఏమిటనేది ఇక్కడ తీవ్రమైన చర్చలకి దారి తీస్తోంది.అయితే ఎంతో మంది విశ్లేషకులు కానీ వైసీపీ నేతలు కానీ ఇద్దరిలో జగన్ వైపు తప్పు ఉంది ఉంటుంది అంటూ రామోజీకి వంత పాడుతున్నారు అంతేకాదు జగన్ రామోజీ చెలికి వాడులుకోడం చారిత్రిక తప్పిదం అంటూ ఫైర్ అవుతున్నారు కూడా ఏది ఏమైనా జగన్ మళ్ళీ పప్పులో కాలేసినట్టే అనేది విశ్లేషకుల వాదన.

తాజా వార్తలు