యూరప్ లో పునర్జన్మ - వింతల్లో వింత

పునర్జన్మ , మళ్ళీ పుట్టడం ఇలాంటి విషయాల గురించి ఎవరైనా నిజం అని చెబితే వారిని పిచ్చోళ్ళు గా చూస్తాం అమనం.

గత జన్మ విశేషాలు గురించి ఎవరైనా మాట్లాడితే మానసిక సమస్య ఉన్నట్టు ట్రీట్ చేస్తాం కానీ యూరప్ లో ఎడ్వర్డ్ అనే నాలుగు సంవత్సరాల పిల్లాడి మాటలు చూస్తుంటే నిజంగా పునర్జన్మలు ఉన్నాయి అనిపించక మానదు.

ఎడ్వర్డ్ అనే నాలుగేళ్ల పిల్లాడికి గొంతులో ఎదో సమస్య రావడతో ఆసుపత్రికి తీసుకునివెళ్ళారు అక్కడ గొంతులో గడ్డ ఉంది అనీ దాని చుట్టూ టాన్సిల్స్ ఉన్నాయ్ అనీ ఆపరేషన్ చెయ్యాలి అనీ డాక్టర్ లు నిర్ధారించారు.ఐతే అక్కడి నుంచి ఇంటికొచ్చాక ఎడ్వర్డ్.

కష్టం మీద మాట కూడబలుక్కుని ‘నాకు బుల్లెట్ తగిలింది’’’ అని చెప్పాడు.

ఐతే తల్లి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

Advertisement

వైద్యులు సర్జరీ చేసి ఎడ్వర్డ్ గొంతులోని గడ్డను తొలగించారు.ఆ తర్వాత ఎడ్వర్డ్ కు మాట స్పష్టంగా వచ్చింది.

అప్పుడు ఎడ్వర్డ్ చెప్పిన మాటలు ఆ తల్లికి మిగతా వాళ్లకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి.తాను ఎడ్వర్డ్ ని కాదు అనీ తన పేరు జేమ్స్ అనీ తాను ఉండేది ఫ్రాన్స్ లోని మారు మూల పల్లెటూళ్ళో అంటూ చెబుతున్నాడు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తాను 18 ఏళ్ల వయసులో సైన్యం లో చేరినప్పుడు తాను అక్కడ చనిపోయా అంటున్నాడు ఎడ్వర్డ్.ఇతను చెప్పిన విషయాలు చూస్తే అక్కడ అన్నీ నిజంగా తెలుస్తున్నాయి.

యూరప్ లో ఈ విషయాల మీద ప్రముఖ పత్రికల్లో కథనాలు వచ్చాయి.ఈ విషయాన్నిముందు పట్టించుకోనివారు ఎడ్వర్డ్ విషయం తెలిసాక ఆశ్చర్యపోతున్నారు.

ధర్మరాజు అహంకారాన్ని దూరం చేసిన శ్రీకృష్ణుడు.. ఎలాగంటే?
Advertisement