రే స్టీవెన్ సన్ పై 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఆ వయసులో కూడా అద్భుతమైన స్టంట్ చేసారంటూ..

ఇండస్ట్రీలో వరుస విషాద వార్తలు ఆడియెన్స్ ను, సినీ ప్రముఖులను కలవర పడుతున్నాయి.

నిన్న నటుడు శరత్ బాబు మరణించిన వార్త మరువక ముందే వెంటనే మరో వార్త బయటకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలో నటించిన కీలక హాలీవుడ్ నటుడు హటాత్తుగా మరణించడం అందరిని కలిచి వేస్తుంది.టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) డైరెక్ట్ గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

Ray Stevenson Dedication In Rrr Movie Details, Rrr Movie, Ray Stevenson, Irish A

ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాలో విలన్ గా( RRR Villain ) కనిపించి మెప్పించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ (58)( Ray Stevenson ) మరణించారు.ఈయన ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించాడు.అయితే ఈ నటుడు ఊహించని విధంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లడం ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.

Advertisement
Ray Stevenson Dedication In RRR Movie Details, RRR Movie, Ray Stevenson, Irish A

ఈ వార్త విన్న వారంతా విషాదం వ్యక్తం చేస్తున్నారు.ఇక తాజాగా మన ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఈయనపై ఒక ఆసక్తికర పోస్ట్ చేసారు.

Ray Stevenson Dedication In Rrr Movie Details, Rrr Movie, Ray Stevenson, Irish A

ఈయన ఈ సినిమా షూటింగ్ సమయంలో 56 ఏళ్ల వయసులో కూడా ఈ సినిమా కోసం అద్భుతమైన స్టంట్ చేసారని తెలిపారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ నుండి ఒక ఫోటోను సైతం షేర్ చేసారు.మీరు సెట్స్ లో ఉన్నంత సమయం ఎంతో ఆనందంగా గడిపామని.

మీరు మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్లిపోయారని.టీమ్ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈయన డెడికేషన్ ఏ లెవల్లో ఉంటుందో చూసి నెటిజెన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు