ఆ డైరెక్టర్‌తో మాస్‌రాజా చిత్రం కన్ఫం?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలను ఆయన వింటూ వచ్చాడు.

ఈ క్రమంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి రవితేజ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఈ కథతో రవితేజ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Advertisement

ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా మారుతి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఈ సినిమాకు రవితేజ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, త్వరలోనే ఈ సినిమాపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ సినిమాను రవితేజ ఓకే చేస్తాడా లేడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇక మారుతి గతచిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న మారుతి, ఇప్పుడు రవితేజ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌వారు ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

వినాయకుడు, లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి కారణం ఏమిటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు