రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏమిటో తెలుసా?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్‌ను మెజారిటీ శాతం పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్ల వరకు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మాస్ రాజా మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు.

Raviteja Krack Movie To Get Theatre Release, Raviteja, Krack Movie, Gopichand Ma

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

ఒకవేళ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే, రవితేజ క్రేజ్ తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ భయపడ్డారు.కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలోని మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని, డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ సినిమాను చూస్తే అసలైన మజా రాదని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించి కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను ఆగస్టు తొలివారంలో షూటింగ్ నిర్వహించి వీలైనంత త్వరగా రిలీజ్‌కు రెడీగా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు