ధమాకా ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా ధమాకా.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

సినిమా మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేయడంతో సూపర్ హిట్ అయ్యింది.అయితే పోస్టర్స్ లో 100 కోట్లు దాటేసిందని వేసినా ఫైనల్ గా ఈ సినిమా ఫైనల్ రన్ లో 86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.

అంటే 44 కోట్ల దాకా షేర్ రాబట్టింది అన్నమాట.ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ కాగా దాదాపు డబుల్ ఫిగర్ రీచ్ అయ్యింది అంటే సినిమా సెన్సేషనల్ హిట్ అయినట్టే.

ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరు లాభాలు పొందారు.ధమాకా సినిమాతో రవితేజ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

ఈ సినిమాతో శ్రీలీల సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.అమ్మడి దూకుడుతనం ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

ధమాకా హిట్ తో శ్రీలీలకు వరుస క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయి.ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా చేస్తున్నాడు.

సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కు సూపర్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
Advertisement

తాజా వార్తలు