మాస్ రాజా ఫ్యాన్స్ గర్వించే విధంగా 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) స్పీడ్ ను ఏ హీరో కూడా అందుకోలేడు అనే చెప్పాలి.

ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.

ఇక రవితేజ ప్రజెంట్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రావణాసుర( Ravanasura ) తో ప్లాప్ అందుకున్నాడు.

ఇక ప్రస్తుతం రవితేజ తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు.ఈయన కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియన్ ( Pan India )సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao ) అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.

డైరెక్టర్ మహేష్( Mahesh ) ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మాతలు నిర్మిస్తున్నారు.

Advertisement

మరి ఈ సినిమా నుండి టీజర్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.మేకర్స్ స్వయంగా ఈ సాలిడ్ సమాచారాన్ని అందించారు.

ఈ సినిమా నుండి అతి త్వరలోనే రవితేజ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే సాలిడ్ అప్డేట్ రాబోతుందట.ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకునే లెవల్లో ఈ అప్డేట్ ఉంటుందని.ఫస్ట్ లుక్ తోనే మాస్ మహారాజ మాస్ సంభవం గ్యారెంటీ అంటూ అతి త్వరలోనే ఈ లుక్ ను రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ ఆ గర్వించే మూమెంట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ( Abhishek Agarwal )ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు