10 రూపాయ‌ల తో మొదలు పెట్టిన ఈ హీరో రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు 10 కోట్లు.!

మాస్ మహరాజ్ గా గుర్తింపు పొందిన ర‌వి తేజ‌.ఏసినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మొద‌లైన త‌న ప్ర‌స్తానం.అప్రెంటీస్ డైరెక్ట‌ర్, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి హీరోగా.

స్టార్ హీరోగా ఎదిగింది.ఈ ప్ర‌యాణంలో త‌ను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు.

స్నేహితుల ఎన‌లేని స‌హ‌కారం ఉన్న‌త స్థాయికి చేర్చాయి.సినిమా అవ‌కాశాల కోసం 1988లో ర‌వితేజ‌ చెన్నైకి వెళ్లాడు.

Advertisement
Ravi Teja Remuneration From 10 Rupees To 10 Crores , Ravi Tjea, Ravi Teja Remune

ఏడాది పాటు ఏ అవ‌కాశం రాక ఖాళీగా తిరిగాడు.ఆ సమ‌యంలోనే గుణశేఖర్, వైవిఎస్ చౌదరితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఈ ముగ్గురు క‌లిసి ఓ రూమ్ తీసుకున్నారు.చేతిలో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో చిన్నసినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా న‌టించాడు.అందుకు గాను త‌న‌కు రోజుకు 10 రూపాయ‌లు వ‌చ్చేవి.1990 లో గుణశేఖర్ చెప్ప‌డంతో కర్తవ్యం మూవీలో చిన్న క్యారెక్ట‌ర్ చేశాడు.ఆ స‌మ‌యంలో కృష్ణ‌వంశీతో స్నేహం ఏర్ప‌డింది.

డ‌బ్బుల‌కు ఇబ్బంది కావ‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు.అనగనగా ఒకరోజు, గులాబీ సినిమాలకు అప్రెంటిస్ గా ప‌నిచేశాడు.1996 లో నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.ఆ స‌మయంలో అదే సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన‌ పూరి జగన్నాథ్ తో ప‌రిచయం ఏర్ప‌డింది.

త‌ర్వాత‌ కృష్ణవంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సింధూరం సినిమాలో ర‌వితేజ కు గ్రూప్ హీరోగా చాన్స్ఇచ్చాడు.

Ravi Teja Remuneration From 10 Rupees To 10 Crores , Ravi Tjea, Ravi Teja Remune
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

మనసిచ్చి చూడు సినిమాకు ప‌నిచేస్తున్న రోజుల్లో ‌రవి ‌తేజ‌ ఫ్రెండ్ అయిన శ్రీను వైట్ల త‌న తొలి సినిమాలో అవకాశమిస్తానని ర‌వితేజ‌కు హామీ ఇచ్చాడు.అన్న‌ట్లుగానే అత‌డి ఫ‌స్ట్ మూవీ నీకోసం మూవీలో ర‌వితేజ‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు.ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్, అమ్మ నాన్న ఓ తమి అమ్మాయి సినిమాల‌తో ర‌వితేజ‌కు మంచి హిట్స్ ఇచ్చాడు.

Advertisement

ర‌వితేజ‌ను స్టార్ హీరోగా చేశాడు.సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ప్పుడు 10 రూపాయ‌లు తీసుకున్న ర‌వితేజ.ఇప్పుడు 10 కోట్లు తీసుకునే స్థాయికి చేరాడు.

త‌న ఎదుగుద‌ల‌కు త‌న మిత్రులే కార‌ణం అంటాడు ర‌వితేజ‌.గుణశేఖర్, కృష్ణ‌వంశీ , పూరీ, శ్రీను వైట్ల , వై వీఎస్ చౌదరి త‌ను ఈ స్థాయికి తీసుకొచ్చార‌ని చెప్తాడు.

వారు కష్టాల్లో ఉన్నప్పుడు అతి త‌క్కువ‌ రెమ్యునరేషన్ తో ర‌వితేజ కూడా సినిమాలు చేసి స‌హ‌క‌రించాడు.

తాజా వార్తలు