రవితేజ రావణాసుర సందడి ఏది? ధమాకా సక్సెస్‌ కంటిన్యూ అయ్యేనా?

మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా తో సూపర్ హిట్ సొంతం చేసుకొని ఎట్టకేలకు రూ.100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.

రవితేజ తదుపరి సినిమాలు కూడా ఖచ్చితంగా వంద కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే విధంగా ఉంటాయి అని ఆయన అభిమానులు చాలా ధీమా తో ఉన్నారు.

Ravi Teja Ravanasura Movie Release Date Coming And Promotions Not Started,ravite

ధమాకా సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యం లో తన తదుపరి సినిమా రావణాసుర ను వెంటనే విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేశాడు.ఇప్పటికే ఏప్రిల్ 7వ తారీఖున ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే గడువు ఉంది.

అయినా కూడా చిత్రీకరణ ముగించలేదని, అలాగే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ravi Teja Ravanasura Movie Release Date Coming And Promotions Not Started,ravite

రావణాసుర సినిమా కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకపోవడం పట్ల రవితేజ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలం లో సినిమాలు చిత్రీకరించడం కంటే కూడా ప్రమోషన్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

Advertisement
Ravi Teja Ravanasura Movie Release Date Coming And Promotions Not Started,ravite

అలా ఫోకస్ పెట్టకుంటే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు.అందుకే భారీగా కలెక్షన్స్ నమోదయ్యే విధంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే విధంగా నెల రోజుల నుండి రావణాసుర సందడి చేస్తే బాగుంటుందని రవితేజ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ రవితేజ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు బిజీ బిజీగా ఉండడం తో ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు.చివరి రెండు లేదా మూడు వారాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు