రతన టాటా వద్ద ఉన్న అత్యంత విలువైన వస్తువులు చూశారంటే మీకు దిమ్మ తిరుగుతుంది!

టాటా గ్రూప్ అఫ్ సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అలాగే టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా జనాలకు పరిచయం చేయాల్సిన పని లేదు.

వ్యాపార ప్రపంచంలో ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ అతనొక ఇన్ స్పిరేషన్ అనుకోవాలి.ఈరోజు మనం తాగే టీ పొడి దగ్గర నుంచి స్టీల్, కారు, ట్రక్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, విమానాల వరకు ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారం విస్తరించి విజయవంతంగా దూసుకుపోయారు రతన్ టాటా.

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఈయన కూడా ఒకరు.

ఇక ఈయన ఆస్తులు విషయానికొస్తే, 2022 వరకూ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉందని సర్వేలు చెప్పాయి.మరి ఇంత ధనికుడైన రతన్ టాటా జీవనశైలి ఎలా ఉటుంది? ఆయన ఎలాంటి వస్తువులు వాడుతారు? ఇంకా ఆయన నివసించే ఇల్లు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతూ ఉంటాయి.అలాంటివారికోసమే ఈ ఇన్ఫర్మేషన్.మొదట ఎరుపు రంగు ఫెర్రారీ కాలిపోర్నియా మోడల్ ను రతన్ టాటా వాడేవారు.4.3-లీటర్ వీ8 ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం ఖరీదు కోట్లలో ఉంటుంది.

Advertisement

ఇక రతన్ టాటా ప్రయాణాలకు ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ జెట్ ఉండేది.దీని పేరు డస్సాల్ట్ ఫాల్కన్ 2000.2 ఇంజిన్లు కలిగిన ఈ జెట్ ను ఫ్రెంచ్ ఇంజినీర్ల బృందం తయారు చేసిందని అప్పట్లో కధలుకధలుగా వినిపించేవి.అలాగే అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉండే ముంబైలో వున్న రతన్ టాటా బంగ్లా అద్భుతమైన వ్యూ కలిగి ఓ రాజభవనాన్ని తలపిస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఈ బంగ్లాలో మొత్తం 7 అంతస్తులు ఉంటాయి.అలాగే రతన్ టాటా గ్యారేజీలో మసెరటి క్వాట్రోపోర్టే, హై ఎండ్ కారు ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్ ఎల్లప్పుడూ ఉంటాయట.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు