వరుస ఫ్లాప్స్ తో బాలీవుడ్‌ ఆశలు వదిలేసుకున్న ముద్దుగుమ్మ శ్రీవల్లి

తెలుగులో ఛలో మరియు గీత గోవిందం సినిమా లతో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ రష్మిక మందన.

కన్నడ బ్యూటీ అయిన ఈ అమ్మడు ఈ మధ్య కాలం లో కన్నడ సినిమాలు చేయడం లేదు.

అక్కడ తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం తో పాటు కన్నడ సినిమాల మార్కెట్ పరిధి చాలా చిన్నది, అందుకే అక్కడ సినిమాలు చేయాలని ఆసక్తిని రష్మిక మందన చూపించడం లేదు.టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక కి బాలీవుడ్ లో కూడా ఆ మధ్య రెండు మూడు అవకాశాలు తలుపు తట్టాయి.

ఇప్పటికే ఆ సినిమాలు విడుదలయ్యాయి.ఆ రెండు సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా మినిమం ప్రేక్షకులను అలరించలేక పోయాయి.

Rashmika Mandanna Not Getting Big Offers From Bollywood Details, Bollywood, Push

కనీసం ఈమె పాత్రలు అయినా జనాలకు నోటెడ్‌ అయ్యాయా అంటే అది కూడా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం రణబీర్ కపూర్ తో నటిస్తున్న ఒక సినిమా యానిమల్‌ మాత్రమే విడుదలకు ఉంది.ఈ సమయం లో హిందీ లో ఈ ముద్దుగుమ్మను పట్టించుకుంటున్న నాధుడే కరువయ్యాడు.

Advertisement
Rashmika Mandanna Not Getting Big Offers From Bollywood Details, Bollywood, Push

వరుసగా ఫ్లాప్స్ పటడంతో రష్మిక మందన్నా యొక్క హిందీ ఆఫర్స్ పై తీవ్రమైన ప్రభావం పడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది.హిందీ లో ఇప్పటి వరకు ఈ అమ్మడు కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేక పోవడంతో అవకాశాలు కనిపించడం లేదు.

Rashmika Mandanna Not Getting Big Offers From Bollywood Details, Bollywood, Push

ప్రస్తుతం ఈమె నటిస్తున్న రణబీర్ కపూర్ యొక్క యానిమల్‌ సినిమా విడుదలై సక్సెస్ అయితే తప్పితే హిందీ లో రష్మిక మందన మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు లేవంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హిందీ ప్రేక్షకులను యానిమల్ సినిమా తో అలరిస్తేనే ఉత్తరాదిన ఈ అమ్మడికి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు హడావుడి చేసిన ఈ అమ్మడి స్పీడ్ తగ్గింది.

ప్రస్తుతం తెలుగు లో చేస్తున్న పుష్ప 2 సినిమా హిట్ అయితే.హిందీలో కూడా ఆడితే అప్పుడు మళ్లీ అక్కడ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు