మరో బాలీవుడ్ క్రేజీ ఆఫర్ అందుకున్న రష్మిక.. ఏమాత్రం తగ్గలేదుగా?

ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రష్మిక మందన్న అనంతరం గీతగోవిందం వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

ఈ విధంగా ఈ సినిమా మంచి విజయం కావడంతో నితిన్ సరసన భీష్మ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్టు కొట్టిన రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

తెలుగు సినిమాల ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడంతో ఈమెకు వరుస బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ మజ్ను, గుడ్ బై, యానిమల్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం యానిమల్ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకోగా మిగిలిన రెండు సినిమాలు షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మరొక సినిమా ఆఫర్ కూడా ఈమెకు వరించింది.

ఈ క్రమంలోనే రష్మిక బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక ఫైనల్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియజేయునట్లు తెలుస్తోంది.సాధారణంగా ఒక సినిమా అవకాశం అందుకొని ఆ సినిమా హిట్ అయిన తరువాత సినిమా అవకాశాలు రావడం సర్వసాధారణం అయితే రష్మిక విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలలో ఒకటి కూడా విడుదల కాకుండానే ఈమెకు వరుస అవకాశాలు రావడంతో ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

Advertisement
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

తాజా వార్తలు