'రాక్షస రాజా'గా రానా.. పవర్ఫుల్ లుక్ వచ్చేసింది!

టాలీవుడ్ కథానాయకుడు రానా దగ్గుబాటి ( Rana Daggubati )గురించి అందరికి తెలుసు.ఈయన హీరోగా కాకుండానే ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ బిజీగా గడుపుకున్నాడు.

లీడర్ సినిమాతో దగ్గుబాటి వారసుడు హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుని నటన పరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక అక్కడి నుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

జక్కన్న తెరకెక్కించిన బాహుబలి( Baahubali ) సిరీస్ తో ఈయన ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.బాహుబలి సిరీస్ లో విలన్ గా రానా నటనకు అంత ఫిదా అయ్యారు.

మరి అలాంటి రానా నుండి ఈ రోజు మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

Advertisement

ఈ రోజు రానా దగ్గుబాటి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఈయన తన కొత్త సినిమాను ప్రకటించాడు.రానా నాయుడు వెబ్ సిరీస్ తర్వాత రానా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూడగా ఈ రోజు ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

రాక్షస రాజా( Rakshasa Raja )అనే టైటిల్ తో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.రానా ఇందులో గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే వీరి కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కబోతుందని టాక్.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మరి ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు